ఏక్ దం న్యూస్, కోటపల్లి :
కోటపల్లి మండల బీజేపీ కార్యవర్గ సమావేశంలో వ్యవసాయ, రాజకీయ తీర్మానాలను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షురాలు పెద్దింటి స్వప్న-పున్నం చంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగం, రాజకీయ అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేయాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కందుల వెంకన్న, మాజీ మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, బూత్ అధ్యక్షులు కాసెట్టి రాకేష్, అంకన్న, సురేందర్, ఎస్టీ మోర్చా నాయకుడు మహేష్, సీనియర్ నాయకుడు షేగం చంద్రయ్యతో పాటు వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.