శంకరపట్నం లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ఎంపీ జన్మదిన వేడుకలలో కనిపించని సర్పంచులు

శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బుదవారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి వినోద్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పొద్దుటూరి సంజీవరెడ్డి తోపాటు, మాజి సర్పంచులు, మాజి ఎంపిటిసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలలో కనిపించని సర్పంచులు

కాగా మాజి ఎంపి‌ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బిఆరెస్ పార్టీ ఆద్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించగా ఇట్టి వేడుకలలో బిఆరెస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచులు ఒక్కరు పాల్గొనకపోవడం గమనార్హం. కాగా బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకుల తీరు మారడం లేదని, గతంలో మాదిరిగానే వర్గ పోరు కొనసాగుతూనే ఉందని బిఆరెస్ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు.