ఏక్ దం న్యూస్ / వేములవాడ జూలై 21:
అన్నం పరబ్రహ్మ స్వరూపం – ఆహారాన్ని వృథా చేయవద్దు" సాయి రూప ట్రస్ట్ వేములవాడ
ఏక్ దం న్యూస్ / వేములవాడ జూలై 21:
సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధి ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు అన్నప్రసాదం, వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లీ బాబురావు మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శివరాత్రి అరవింద్ జన్మదినం సందర్భంగా ఆయన సహకారంతో కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి దూలం భూమేష్ గౌడ్, ఎద్దండి రాజు, వాసాల హరిప్రసాద్, గొంటి నవీన్, ఉపాధ్యాయులు జయశ్రీ, కిషన్ తదితరులు పాల్గొన్నారు."అన్నం పరబ్రహ్మ స్వరూపం – ఆహారాన్ని వృథా చేయవద్దు" అనే సందేశాన్ని నిర్వాహకులు విద్యార్థులకు తెలియజేశారు.