ఏక్ దం న్యూస్/ ఇల్లంతకుంట జూలై 20 : డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులే కీలకం విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన

ఏక్ దం న్యూస్/ ఇల్లంతకుంట జూలై 20 :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలను వివరించిన ఆయన, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు.అలాగే సైబర్ నేరాల నివారణ, రహదారి భద్రత, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజం అధ్యక్షత వహించగా, అధ్యాపకులు నయీముద్దీన్, మల్లారెడ్డి, శ్రీనివాస్, కిషోర్, లక్ష్మణ్, జీవన్, శంకరయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో ప్రిన్సిపాల్ దేవరాజం మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.