ఏక్ దం న్యూస్/ ఇల్లంతకుంట జూలై 20 : అద్దె ఇళ్లలోనే లబ్ధిదారులు. పూర్తి కాని డబుల్ బెడ్‌రూమ్‌లు నిధులు లేక ఆగిపోయిన పనులా.. లేక అధికారుల నిర్లక్ష్యమా?ఎమ్మెల్యే కంటపడని అసంపూర్తి డబుల్ బెడ్‌రూమ్‌లు?

ఏక్ దం న్యూస్/ ఇల్లంతకుంట జూలై 20 :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
గత ప్రభుత్వం నిర్మించిన 40 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నీటి సరఫరా, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులు, తలుపులు, కిటికీలు వంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా గత ఏడాదే పట్టాలు పంపిణీ చేశారని, దీంతో లబ్ధిదారులు ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేసి శ్రావణ మాసంలోనే లబ్ధిదారులకు గృహప్రవేశాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. పట్టాలు ఇచ్చి ప్రచారం చేసుకోవడం కాదు.ఇళ్లు నివాసయోగ్యంగా చేసి అప్పగించడమే ప్రభుత్వ బాధ్యత" అని నాయకులు విమర్శించారు."పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల యువజన సంఘాల అధ్యక్షుడు భేంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.