ఏక్ దం న్యూస్ – కోనరావుపేట జూలై 20 : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం: మానుక సత్యం నియామక పత్రం అందుకున్న మానుక సత్యం.. నాయకులకు కృతజ్ఞతలు , కాంగ్రెస్ శ్రేణుల ఆశలకు కొత్త నాయకత్వం.

ఏక్ దం న్యూస్ – కోనరావుపేట జూలై 20 :
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మానుక సత్యం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మానుక సత్యం మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష పదవికి అవకాశం కల్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడంతో పాటు మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తానని, కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని మానుక సత్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు.