ఎస్సారార్ ప్రభుత్వ అటానమస్ కళాశాలలో 34 పోస్టులు.. జూలై 20లోపు దరఖాస్తుల సమర్పణ.. జూలై 22న ఇంటర్వ్యూలు.

ఏక్ దం న్యూస్, కరీంనగర్:
కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో ఖాళీగా ఉన్న 34 అతిథి అధ్యాపకుల(గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ తెలిపారు. తెలుగు–4, ఇంగ్లీష్–5, బీకాం (బీఎఫ్‌ఎస్‌ఐ)–1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–5, బీబీఏ–2, బిజినెస్ అనలిటిక్స్–1, బీకాం ఫైనాన్స్–1, బీకాం రిటైల్ ఆపరేషన్స్–1, డేటా సైన్స్–1, బీసీఏ–2, ఫిషరీస్–1, స్టాటిస్టిక్స్–1, క్రాప్ ప్రొడక్షన్–1, మైక్రోబయాలజీ–1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్–1, ఎకనామిక్స్–1, బీఎస్సీ హానర్స్–2, హెల్త్ కేర్–1, జువాలజీ–1, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్–1 చొప్పున ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. కమిషనర్ ప్రొసీడింగ్స్ నిబంధనల ప్రకారం, సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హతలు, బోధనా అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 20, 2026 సాయంత్రం 4 గంటలలోపు తమ బయోడేటాతో పాటు దరఖాస్తులను ఎస్సారార్ కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా జూలై 22, 2026 ఉదయం 10 గంటలకు ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.