ఏక్ దం న్యూస్/ఇల్లంతకుంట జూన్ 12 :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో "టిఫిన్ బైఠక్" కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు చేపట్టిన "మనబడి–మన బాధ్యత (స్వచ్ఛ పాఠశాల)" కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.బీజేపీ ఇల్లంతకుంట మండల ప్రధాన కార్యదర్శి పినికాశి అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి పిల్లి గోపాల్, కార్యవర్గ సభ్యులు సంద వేణి రాజశేఖర్, గుంటి వేణు, నాయిని పరుశురాం, నాయకులు నరేష్, శ్రీకాంత్, అజయ్, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల పరిశుభ్రత, అభివృద్ధిపై చర్చించారు.