ఏక్ దం న్యూస్ హైదరాబాద్ జూన్ 07: తెలంగాణ రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రత కారణంగా తెలంగాణ పాఠశాలల పునఃప్రారంభ తేదీ మార్పు.వేసవి సెలవులు15 వరకు పొడగింపు

ఏక్ దం న్యూస్ హైదరాబాద్ జూన్ 07:
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి జూన్ 12, 2026న ప్రారంభం కావాల్సిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను జూన్ 15, 2026 (సోమవారం) న ప్రారంభించాలని నిర్ణయించారు జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) సెలవులు ఉండటంతో ఈ మార్పు చేశారు.కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడానికి జూలై 11, 2026 (రెండో శనివారం) ను సాధారణ పని దినంగా నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.పాఠశాల విద్యాశాఖ, ప్రకటనలో తెలిపింది